MyGunturMP తరచుగా అడిగే ప్రశ్నలు
1. MY GUNTUR MP ఉద్దేశం మరియు లక్ష్యాలు ఏమిటి?
- ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అర్జీలు సమర్పించవచ్చు.
- అర్జీల స్థితిని తెలుసుకోవచ్చు.
- అభివృద్ధి కోసం మీ విలువైన సలహాలు అందించవచ్చు.
- నగరాభివృద్ధికి దాతలుగా సహకరించవచ్చు.
2. ఇక్కడ ఎలాంటి అర్జీలను సమర్పించవచ్చు?
- వ్యక్తిగత అర్జీలు - రైతులు, పోలీసు, రెవెన్యూ, ఇతర సంబంధిత అర్జీలు.
- మౌలిక వసతుల అర్జీలు - రైల్వే, రోడ్డు, నీరు, కాలువలు, ఆసుపత్రి.
- ఉద్యోగాల అర్జీలు.
- వైద్య సేవలు.
- విద్య.
- సహాయం - ప్రతిభ గల విద్యార్థులు, ఇళ్ల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, నైపుణ్య అభివృద్ధి.
- సూచనలు.
3. ఏయే భాషల్లో అర్జీలను సమర్పించవచ్చు?
తెలుగు లేదా ఇంగ్లిష్ లో అర్జీలను సమర్పించవచ్చు.
4. అర్జీలను పోర్టల్‌లో ఎలా సమర్పించాలి?
- “రిజిస్టర్ అవ్వండి” పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ మరియు OTP ద్వారా MY GUNTUR MP పోర్టల్ కు రిజిస్టర్ అవ్వండి.
- ‘‘అర్జీని సమర్పించండి’’పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలను ఫారంలో నమోదు చేయండి.
- ఫారం పూర్తి చేసిన వెంటనే అర్జీ యొక్క ID వివరాలను SMS ద్వారా పొందండి.
5. నేను ఇప్పటికే దాఖలు చేసిన అర్జీల అప్ డేట్ ఎలా తెలుసుకోవాలి?
వెబ్ సైట్ లో ‘‘అర్జీ అప్ డేట్స్’’పై క్లిక్ చేసి మీరు ఇప్పుడు వరకు దాఖలు చేసిన అర్జీల వివరాలను తెలుసుకోవచ్చు.
6. మొబైల్ కు OTP రాకపోతే ఏమి చేయాలి?
మీరు అర్జీని ఫైల్ చేసిన 60 సెకన్లలోపు OTP రాకపోతే, "మళ్లీ SUBMIT" చేయాలి. సాంకేతిక సమస్య కారణంగా అప్పటికీ OTP రాకపోతే helpline@drpemmasani.comకి మెయిల్ కు పంపవచ్చు.
7. అర్జీతోపాటు సంబంధిత పత్రాలు/ఫొటోలను జత పరచవచ్చా?
40 MB ఫైల్ పరిమాణం వరకు పత్రాలు/ఫొటోలను జత పరచవచ్చు.
8. పౌరులను వారి అర్జీల పరిష్కారం గురించి అప్‌డేట్‌గా ఉంచడానికి My Guntur MP బృందం అనుసరించిన విధానం ఏమిటి?
అర్జీని విజయవంతంగా సమర్పించిన తర్వాత, SMS ద్వారా అర్జీ ID పంపబడుతుంది. అర్జీని అప్‌డేట్ చేసినప్పుడు మీరు SMSను పొందుతారు. వెబ్ సైట్ లో అర్జీ స్థితిని తెలుసుకునేందుకు ‘‘అర్జీ అప్ డేట్స్’’పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
9. ఒక అర్జీని క్లోజ్ చేశాక మళ్లీ అదే అర్జీని నమోదు చేయవచ్చా?
సరైన కారణం ఉంటే ఎంపీ కార్యాలయాన్ని సందర్శించి అర్జీ పై పునః పరిశీలన కోరవచ్చు. అక్కడ సిబ్బంది సూచనల మేరకు అర్జీని నమోదు చేయవచ్చు.
10. మీరు తీసుకున్న చర్య సంతృప్తికరంగా లేకుంటే ఏమి చేయాలి?
పునః పరిశీలన కోరుతూ అర్జీ ని మళ్లీ తెరవమని అభ్యర్థించవచ్చు.
11. పోర్టల్ ప్రతిస్పందించకపోతే ఏమి చేయాలి?
- బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయండి.
- లాగ్ అవుట్ చేసి మళ్లీ లాగిన్ అవ్వండి.
- వేరే బ్రౌజర్‌ని ప్రయత్నించండి.
- మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి.
- ఇవేవీ పని చేయకుంటే, helpline@drpemmasani.comలో మెయిల్ చేయండి లేదా ఎంపీ కార్యాలయాన్ని సందర్శించి మీ అర్జీని నమోదు చేయవచ్చు.